శర్వానంద్ కథానాయకుడిగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం బుధవారం జూబ్లీ హిల్స్‌లో జరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోగా, ఈ ప్రాజెక్ట్‌కు 'జార్జ్ క్రిష్' అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.

ప్రస్తుతం శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' సినిమాలో నటిస్తున్నాడు. ఆగస్టు 28న ఈ చిత్రం విడుదల కానుండగా, అది పూర్తయిన వెంటనే శ్రీను వైట్లతో కలిసి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

ఈ చిత్రంలో కథానాయికగా ప్రీతి ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.