డ్రాగన్, ఫంకీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కయాదు లోహర్, ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మరో అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం నాని సరసన 'ది ప్యారడైజ్' సినిమాలో నటిస్తున్న ఆమె, త్వరలో అజిత్ 64వ చిత్రంలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంది. కథలో కీలకమైన పాత్ర కోసం కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు కథాగమనంలో మంచి ప్రాధాన్యత ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాతో పాటు సూర్య 48వ చిత్రంలో కూడా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. అజిత్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.