బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం కేంద్రంలో, మహాయుతి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం చూపిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా 'ఇది యువత భవిష్యత్తును కొల్లగొట్టే కుట్ర' అని పేర్కొన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కె 'పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీల విడదీయడం, ఎంపీల కొనుగోలుపై దృష్టి పెట్టింది' అని విమర్శించారు.
ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్ష రద్దు తోపాటు నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో లీక్‌లు జరిగిన సందర్భంలో 'దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ దోపిడీ వ్యవస్థగా మారిందని' ప్రతిపక్షాలు భావిస్తున్నారు. ఈ ఘటనలపై సీబీఐ విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.








