అమెరికాలో హైవేలపై జరుగుతున్న ప్రమాదాలకు ట్రక్ డ్రైవర్లే ప్రధాన కారణమని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. డ్రైవర్లు సురక్షిత సంకేతాలను సరిగ్గా చదవలేకపోవడం, మద్యం లేదా మాదక ద్రవ్యాల ప్రభావంలో వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, సరైన అనుమతులు లేని ట్రక్ డ్రైవర్లను విధుల నుంచి తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రైవర్లలో ఇప్పటికే సగం మంది వెటరన్లు (మాజీ సైనికులు) ఉండటం గమనార్హం.
అనుమతి లేని డ్రైవర్ల తొలగింపు ప్రక్రియను చేపడుతూనే, వెటరన్లకు ప్రాధాన్యతనిస్తూ ట్రక్ డ్రైవర్ లైసెన్సులు అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.








