బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ మరియు ఆమె సోదరి నమ్రతా శిరోద్కర్ ఇటీవల ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’ షోలో పాల్గొన్న సమయంలో మహేష్ బాబు వివాహ జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటనను వెల్లడించారు. మహేష్ బాబు మరియు నమ్రతా వివాహం చేసుకున్న మొదటి రోజుల్లో, మహేష్ బాబుకు మరాఠీ భాష రాదని ఇద్దరూ భావించారని శిల్పా చెప్పారు. అందుకే ఇంట్లో వ్యక్తిగత సంభాషణలు జరిగినప్పుడు తాము మరాఠీలోనే మాట్లాడేవారని గుర్తుచేశారు.
అయితే ఒక రోజు అనుకోకుండా జరిగిన సంఘటన వారిద్దరినీ ఆశ్చర్యపరిచింది. శిల్పా మరాఠీలో మాట్లాడుతుండగా మహేష్ బాబు ఆ సంభాషణకు స్పందించినట్లు వెల్లడించారు. మహేష్ బాబు మరాఠీ భాషలో నైపుణ్యం కలిగి ఉన్నారని ఆమె ఆనందంతో చెప్పారు.
ఈ విషయం బయటపెట్టకుండా మహేష్ బాబు సైలెంట్‌గా ఉండటం తమకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించిందని శిల్పా నవ్వుతూ చెప్పారు. ఈ చిన్న ఫ్యామిలీ మెమరీ ఇప్పుడు సోషల్ మీడియాలో .








