రామాయణం చిత్రంలో సూర్పనఖ పాత్రను పోషిస్తున్నందుకు నటి రకుల్ ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తనకు కేవలం ఒక సినిమా చేయడం మాత్రమే కాదని, అదొక గొప్ప ప్రయాణమని ఆమె అభివర్ణించారు.
జూలై 18న ఢిల్లీలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన పాత్ర గురించి, సినిమా పట్ల తనకున్న ఉత్సాహాన్ని పంచుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








