జూన్ 18న పుణెలోని లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ హత్యలో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రధాన నిందితులు. పోలీసులు సీన్ రీక్రియేషన్ ద్వారా నిజాన్ని బయటపెట్టారు.
పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతో సియా ఈ హత్యకు ప్రణాళిక చేసిందని విచారణలో బయటపడింది. సియా తల్లిదండ్రులు, సోదరుడిని 12 గంటల పాటు ప్రశ్నించారు.
స్థానికులు కోవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.







