ముంబైలో రెహమతాబాద్ స్మశానవాటిక సమీపంలో జరిగిన ఆశూరా ఊరేగింపు సమయంలో ఫయ్యాజ్ నిసార్ హుస్సేన్ ప్రేంజీ అనే వ్యక్తి నొప్పి నివారణ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే మందులుగా చెప్పి విషపూరిత క్యాప్సూల్స్ పంచాడు. ఈ క్యాప్సూల్స్ లోపల ఎలుకలకు విషంగా ఉపయోగించే జింక్ ఫాస్ఫైడ్ రసాయనం ఉంది.
ఈ సంఘటనలో 11 మందికి అనారోగ్యం తోటి ఆసుపత్రికి తరలించబడ్డారు. వారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. సల్మాన్ సయ్యద్ అనే 26 ఏళ్ల యువకుడు కడుపు నొప్పి, వాంతులతో ఫిర్యాదు చేసినప్పుడు ఈ కేసు బయటపడింది.
నిందితుడిని అరెస్ట్ చేస్తున్న ముందే అతను 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ కొన్నాడని, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ ఆర్డర్ చేసాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతను ఒంటరిగా పనిచేశాడా లేదా ఇతరుల సహాయంతో పనిచేశాడా అనే దాని మీద దర్యాప్తు జరుగుతోంది.
జప్తు చేసిన 14,900 క్యాప్సూల్స్, రసాయన నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. నిందితుడు ముహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రశ్నలో ఒప్పుకున్నట్లు తెలిసింది.







