దేవరపల్లి నుండి వెంకటేష్ ఒమాహాలో నివసిస్తున్నారు. కాన్సాస్‌లో భారీ వరదల్లో వెల్లింగ్టన్ సమీపంలోని ఆలివర్ రోడ్‌లో అతని కారు కొట్టుకుపోయింది. కారు, బ్యాగ్ దొరికాయి కానీ మొబైల్ ఫోన్ లేదా ఆచూకీ ఇంకా లభించలేదు.
పర్చూరు ఎమ్మెల్యే ఈ విషయాన్ని తెలుసుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మూడు లేఖలు రాశారు. బాధితుడి కోసం గాలింపు చర్యలు తీసుకుని వివరాలను తెలియజేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఐటీ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వరదల్లో తప్పిపోయిన వ్యక్తి గురించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే ఏలూరి సహాయ చర్యలు కోసం కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదిస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తి గురించి సమాచారం సేకరించడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.






