ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టులో మార్పు చేయబడింది. బీసీసీఐ స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ స్థానంలో శివమ్ దూబేను ఎంపిక చేసింది.

నితీష్ కుమార్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రంగా ఉండటంతో జూలై 14న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ నాటికి అతను కోలుకునే అవకాశం లేదు.

శివమ్ దూబే 2024లో భారత్ తరుఫున చివరిసారి వన్డే మ్యాచ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత అతను వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను డేంజరస్ ఆల్ రౌండర్ గా జట్టులో చోటు సంపాదించాడు.

భారత వన్డే జట్టులో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కె. ఎల్. రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ మరియు శివమ్ దూబే ఉన్నారు.