తెలంగాణ ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను గుర్తించింది. మరణించిన వారి పేరుతో పెన్షన్ తీసుకోవడం, ఒకే ఇంట్లో ఇద్దరు పొందడం, ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారికి పెన్షన్ ఇవ్వడం వంటి అక్రమాలను ఈ ప్రక్రియ వెల్లడించింది.

ఈ అనర్హుల పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ద్వారా విమోచించిన నిధులను నిజమైన పేదలకు మళ్లించే ప్లాన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇప్పటికే సుమారు రెండు లక్షల మంది కొత్త అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. తొలగించబోయే లక్ష మంది స్థానంలో మరో లక్ష మందిని కొత్తగా ఎంపిక చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు పొందే వారి సంఖ్య మూడు లక్షలకు చేరుతుంది.

ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. క్షేత్రస్థాయి అధికారులు పరిశీలనల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.