దేవుడి గుడికి వెళ్తే సాధారణంగా స్వామీ నాకు ఆస్తులివ్వు..బంగారం ఇవ్వు.. లేదంటే మంచి ఉద్యోగం ఇవ్వు అని కోరుకుంటారు.. మొక్కులు చెల్లిస్తారు.
కానీ అనంతపురం జిల్లాలో ఓ మహిళ విచిత్రమైన కోరిక కోరుతూ స్వామివారి హుండీలో రూ.20లు సమర్పించింది. ఆలయ హుండీ లెక్కింపు సమయంలో బయటపడిన ఆ నోటు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. భక్తులు ఇలాంటి కోరికలు కూడా కోరతారా అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలో ఓ భక్తురాలు ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లింది. అక్కడ స్వామివారికి మొక్కుకుని హుండీలో ఓ రూ.20లు స్వామివారికి సుపారీ ఇచ్చి తన అత్త చనిపోవాలంటూ కోరుకుంది.
ఇటీవల ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కిస్తుండగా ఒక రూ.20 నోటు కనిపించింది. దానిపై రాసి ఉన్న అక్షరాలను చూసి అధికారులు, భక్తులు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఆ నోటుపై..
అత్త పెట్టే టార్చర్ భరించలేక సదరు కోడలు దేవుడి హుండీలో నోటు వేసి మరీ మొక్కుకున్నట్లు అర్థమవుతోంది. ఈ వింత కోరికను చూసి ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. ఈ న్యూస్ కాస్తా బయటపడటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
“అత్తా-కోడళ్ల గొడవలను దేవుడు కూడా తీర్చలేక హుండీ పక్కన పెట్టేలా ఉన్నాడు” అని కొందరు, “కేవలం ఇరవై రూపాయలకే అత్తను లేపేయాలని దేవుడిని కోరడం టూ మచ్” అని మరికొందరు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ‘రూ.20 నోటు’ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.








