సిరిసిల్లలోని బాలాజీ స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన స్నాక్స్‌లో బల్లి కనిపించడం వినియోగదారుడి ఆరోపణ. ఈ ఘటనపై వ్యాపారం చేస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

సిరిసిల్ల పట్టణ ప్రజలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని బేకరీలు, స్వీట్ హౌస్‌లపై తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

చాలా షాపుల్లో గడువు తీరిన కేక్లు, స్వీట్లను రోజుల తరబడి నిల్వ చేసి అమ్ముతున్నారు. కేక్ తయారీలో బటర్ పేపర్‌కు బదులు న్యూస్ పేపర్ ఉపయోగిస్తున్నారు. గడువు తీరిన ఫుడ్ కలర్స్ బాటిల్స్ కూడా వాడుతున్నారు.

అనేక బేకరీల్లో కేక్‌లపై తయారీ తేదీ, పరిమితి తేదీ లేబుల్ వేయడం లేదు. శుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారం తయారు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.