గిరి గూడేల్లో సోమవారం అకాడి పండుగ ప్రారంభమైంది. ఈ పండుగ ఆషాఢ మాసంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమై గురుపౌర్ణిమ రోజు ముగుస్తుంది. ఆదివాసీలు ఈ పండుగనే మొదటిగా జరుపుకుని తర్వాత మిగతా పండుగలు చేసుకుంటారు.
పండుగ రోజుల్లో గ్రామం నుంచి పులిమేరలోని బాబ్రి చెట్టు వద్దకు వెళ్లి దేవతలను శుద్ధి చేసి పుసుపుతో గీతలు గీశారు. రాజుల్ పేన్‌కు ప్రత్యేక పూజలు చేసి వనంలోనే భోజనం చేశారు. లక్ష్మణ రేఖ గీసి పశువులను అడవుల్లోకి తరలించారు.
అడవుల్లోని చెట్ల ఆకులను దేవునిగా భావించి అకాడి పేన్ పూజ చేసి ఆకులను ఇంటికి తీసుకురాగా, ప్రతీ ఇంటి నుంచి ఒక్కో కోడిని కొని దేవతకు బలి చెయ్యడం ప్రాముఖ్యత పొందింది. కోడి తమ జాతకం చెబుతుందని నమ్ముతారు. పశువులు తిరిగి రావడానికి తుర్ర వాయించడం కూడా వారి ఆచారం.
అకాడి పూజలు ముగిసిన తర్వాత ఏత్మాసార్ పేన్‌కు పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఈ పండుగలో మొక్కుతారు. సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్ రావు ఈ పండుగ అనాధిగా వస్తున్న ఆచారమని చెబుతున్నారు.





