48 జట్లతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. జులై 19 ఆదివారం న్యూయార్క్‌లోని న్యూజెర్సీ స్టేడియంలో అర్జెంటీనా మరియు స్పెయిన్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఫిఫా కళ్లు చెదిరే ముగింపు వేడుకలను సిద్ధం చేసింది.

ప్రీ-మ్యాచ్ షోలో లారా పౌసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్ మరియు ఐషోస్పీడ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ప్రత్యేక అప్పియరెన్స్ ఇవ్వనుండగా, జెన్నిఫర్ హడ్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించి ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఫిఫా చరిత్రలో తొలిసారిగా 25 నిమిషాల పాటు సాగే మెగా హాఫ్-టైమ్ షోను నిర్వహించబోతున్నారు.

కోల్డ్‌ప్లే లీడర్ క్రిస్ మార్టిన్ క్యూరేట్ చేయనున్న ఈ షోలో మడోన్నా, షకీరా, జస్టిన్ బీబర్ మరియు కొరియన్ పాప్ BTS పాల్గొంటారు. ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ మద్దతుతో చిన్నారుల విద్య, ఫుట్‌బాల్ అవకాశాల కోసం 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడం ఈ షో ముఖ్య ఉద్దేశం. భారత కాలమానం ప్రకారం జులై 19 ఆదివారం రాత్రి 11:00 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

90 నిమిషాల పాటు సాగే ఈ కార్యక్రమం తర్వాత, సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు అర్జెంటీనా మరియు స్పెయిన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది.