10TV గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ సందడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు రావడం వల్ల తాను ఎంతో కొత్త విషయాలను నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎగుమతుల ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీకాంత్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎగుమతిదారులందరినీ ఒకే చోట కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎగుమతుల రంగం గురించి మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. నిరంతరం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని ఆయన ముగించారు.







