సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, పరిశోధకులు ఒక వర్చువల్ రూమ్‌లో 1,000 AI ఏజెంట్లను ఉంచి రెండు అర్థం లేని ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోమని కోరారు. ఎటువంటి రివార్డులు లేదా లీడర్ల సహాయం లేకపోయినా, ఈ ఏజెంట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే మెజారిటీగా ఒకే ఆప్షన్‌ను ఎంచుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా AI ఏజెంట్లు నియంత్రణ లేకుండానే తమలో తాము సమన్వయం (కోఆర్డినేట్) చేసుకోగలవని స్పష్టమైంది.

ఈ ఏజెంట్లు LLMలు అంటే మనుషుల భాషను అర్థం చేసుకుని, సొంతంగా పనులు చేయగల ప్రోగ్రామ్డ్ సిస్టమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. పరిశోధకులు Claude, GPT, Llama ఫ్యామిలీలకు చెందిన 10 మోడల్స్‌ను పరీక్షించగా, ప్రతి మోడల్ ఒకే రకమైన గణిత నియమాన్ని అనుసరించడం గమనించారు. ఈ గణిత నమూనాను పరిశోధకులు 'మెజారిటీ ఫోర్స్' అని పిలుస్తున్నారు, ఇది ఏజెంట్లు ఒకే నిర్ణయం వైపు ఎంత బలంగా ఆకర్షితమవుతాయో తెలియజేస్తుంది.

ఈ సామర్థ్యం వల్ల భవిష్యత్తులో వేలాది AI ఏజెంట్లు మనిషి ఆదేశం లేకుండానే పెద్ద సైంటిఫిక్ లేదా ఇంజనీరింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలవని పరిశోధకులు భావిస్తున్నారు.