విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో సిటి అధికారులు వివరించిన కీలక అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర గా మారాయి. ఈ కేసులో మద్యం రవాణా టెండర్ల పేరుతో ఏకంగా ₹192 కోట్ల అక్రమాలు జరిగాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా ముందస్తు అనుమతులు లేకుండానే టెండర్ విధానాన్ని పూర్తిగా మార్చారు.

కిలోమీటరుకు ₹19.68 చార్జీని ₹35కు పెంచి దోపిడీకి పాల్పడ్డారని సిటి అధికారులు పేర్కొన్నారు. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు బినామీ కంపెనీలను ఉపయోగించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లకు జ్యూడీషియల్ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

హైదరాబాద్‌లోని నిందితులను విజయవాడకు తరలించిన సిటి అధికారులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం నిందితులందరినీ జైలుకు తరలించగా, ఈ కుంభకోణంలో మరికొందరు కీలక నేతల పేర్లు బయటపడే అవకాశం ఉందని సమాచారం.