వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌తో యుద్ధాన్ని మరో 60 రోజులు కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదం కోరుతోంది. అమెరికా బలగాలు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించాయని యుద్ధ అధికారాల నోటీసు ఇచ్చారు.
అమెరికా నిబంధనల ప్రకారం, ఏ దేశంపై అయినా యుద్ధానికి వెళ్లాలంటే కాంగ్రెస్ అధికారిక ఆమోదం తీసుకోవడం తప్పనిసరి. ఈ నియమం ప్రకారం యుద్ధం గరిష్ఠంగా 60 రోజుల పాటు మాత్రమే జరగగలదు. యుద్ధం మొదలు చేసిన 48 గంటల్లోపు కాంగ్రెస్‌కు నివేదించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ ఆమోదం లేకపోతే, యుద్ధం తప్పనిసరిగా నిలిపివేయబడుతుంది. ట్రంప్ ప్రభుత్వం యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ ఆమోదం తీసుకోవడమే ఏకైక మార్గం.







