స్లోవాకియా వేదికగా జరిగిన యు-20 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో (20 ఏళ్ల లోపు వయస్సు గల క్రీడాకారుల ప్రపంచ స్థాయి కుస్తీ పోటీలు) భారత మహిళా రెజ్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ పోటీల్లో కజల్ ధోచక్ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
76 కేజీల విభాగంలో కజల్ ధోచక్ ఈ విజయాన్ని అందుకుంది. అదే సమయంలో, ఇతర విభాగాల్లో కూడా భారత క్రీడాకారిణులు పతకాలతో మెరిశారు.
72 కేజీల విభాగంలో తను శర్మ వెండి పతకాన్ని గెలుచుకుంది. ఈ పతకం కోసం తను శర్మ జపాన్‌కు చెందిన చిసాటో యోషిదాతో హోరాహోరీగా తలపడింది.
మరోవైపు 62 కేజీల విభాగంలో సవిత వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో సవిత జపాన్ రెజ్లర్ సకురా ఒనిషితో పోటీపడి ఈ ఘనత సాధించింది.
మొత్తంగా ఈ అంతర్జాతీయ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, రెండు వెండి పతకాలను సాధించి తన సత్తా చాటింది.








