భువనగిరి అర్బన్, జూన్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మండలాల జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం భువనగిరి పట్టణంలో వందన కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను పరిష్కరించి ఇడ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
జర్నలిస్టులకు సొంత ఇండ్లు లేక అద్దె ఇండల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గృహ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శులు నాగరాజు, కదిర్, భువనగిరి మండల కార్యదర్శి అల్తాఫ్, గుండాల అధ్యక్షుడు నరేష్, మోత్కూర్ అధ్యక్షుడు నర్సింహా, అడ్డగూడూర్ అధ్యక్షుడు సందీప్, తుర్కపల్లి కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.








