యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎదురుచూసిన ఈ క్షణం రానే వచ్చేసింది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అధికారిక X ఖాతాలో రిలీజ్ అవుతుంది.

సుబ్రమణ్య స్వామి రాసిన పురాణఇతిహాసం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా, పురాణాలు, మహా యుద్ధాలు, దైవిక శక్తులు, కుటుంబ బంధాల సమ్మేళనంతో సాగుతుంది. మురుగన్ యుద్ధతంత్రం మరియు జ్ఞానానికి ప్రతీకగా చిత్రంలో చిత్రీకరించబడ్డారు.

ఈ చిత్రం గురించి తెలుసుకోవడానికి ఆడియెన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియాలో #GodOfWarNTR హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ సంగీత దిగ్గజం అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్టు తెలిసిన వెంటనే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.