AI సంస్థ Anthropic, క్లౌడ్ స్టార్టప్ Voltaతో 10 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందం ద్వారా రాబోయే ఆరు సంవత్సరాల పాటు Anthropicకు అవసరమైన క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను Volta అందించనుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా నార్వేలో కొత్తగా ఒక డేటా సెంటర్‌ను Volta నిర్మించనుంది. 133 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్, Nvidiaకు చెందిన Vera Rubin సిస్టమ్స్‌తో పనిచేయనుంది. Volta సంస్థ Nvidia క్లౌడ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యకలాపాలను చేపడుతోంది.
గత కొద్ది నెలలుగా Anthropic తన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే SpaceX మరియు Amazon సంస్థలతో కూడా కొత్త కంప్యూటింగ్ ఒప్పందాలను Anthropic ప్రకటించింది.








