Vivo X500 ప్రో మ్యాక్స్ ఫోన్ V2602DA మోడల్ నంబర్‌తో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3C) — అంటే చైనాలో విక్రయించే ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతను ధృవీకరించే వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని అంచనా.

Vivo X500 ప్రో మ్యాక్స్ కెమెరా సిస్టమ్‌పై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో 50MP సోనీ LOFIC ప్రైమరీ కెమెరా, 85mm ఫోకల్ లెంగ్త్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. ఈ కెమెరా హై క్వాలిటీ టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీకి — అంటే వస్తువులను దగ్గరగా, స్పష్టంగా తీయడానికి సహకరిస్తుంది.

మరోవైపు Vivo X500 ప్రో మోడల్‌లో 6.37-అంగుళాల డిస్‌ప్లే, 7,000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండవచ్చని అంచనా. ఇందులో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త సిరీస్ గత ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో విడుదలైన Vivo X300 ప్రోకు అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే, ఈ కొత్త ఫోన్ల విడుదల తేదీలు, ధరల గురించి వివో కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.