Telugu » Technology » Vivo X500 Series Launch Confirmed Here Is What We Know So Far

Vivo X500 Series Launch : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీకోసం వివో నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ వచ్చేస్తోంది. సెప్టెంబర్‌లో చైనాలో ఈ సిరీస్ లాంచ్ కావచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను వివో X500 సిరీస్ పేరుతో కంపెనీ లాంచ్ చేయనుంది. ఇందులో వివో X500, X500 ప్రో కొత్త X500 ప్రో మాక్స్ అనే 3 వేరియంట్లు ఉంటాయి.

ఈ వివో ఫోన్లు ముఖ్యంగా డైనమిక్ రేంజ్, వీడియో రికార్డింగ్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌లో కెమెరా అప్‌గ్రేడ్స్ అందిస్తాయి. ఈ బ్రాండ్ చైనా లాంచ్ తేదీని వెరిఫై చేయనప్పటికీ భారత్ లాంచ్ ఎప్పుడూ అనేది క్లారిటీ ఇవ్వలేదు.

వివో X500 ప్రో సిరీస్ కెమెరా అప్‌డేట్ : నివేదికల ప్రకారం.. వివో X500 ప్రో సిరీస్‌లో బ్లూప్రింట్ ఫాంటమ్ 900 సెన్సార్ ఆధారంగా కొత్త జైస్ సూపర్ డైనమిక్ ప్రైమరీ కెమెరాను అందించనుంది. ఈ సెన్సార్ 17EV వరకు డైనమిక్ రేంజ్‌ అందించగలదు.

ఈ ఫోన్లలో 240fps వరకు 4K స్లో-మోషన్ వీడియో 120fps వద్ద 4K HDR రికార్డింగ్‌తో సహా అడ్వాన్స్ వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తాయని భావిస్తున్నారు. వివో X500 ప్రో మోడళ్లలో 3-డిగ్రీల ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంటుందని అంచనా. వివో X500 ప్రో మాక్స్‌లో అత్యంత అడ్వాన్స్ వెర్షన్ ఉంటుంది. CIPA 7.0-రేటెడ్ ప్రొఫెషనల్ స్టెబిలైజేషన్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు.

వివో X500 ప్రో మాక్స్ ఫీచర్లు : వివో ప్రో మాక్స్ లైనప్‌లో టాప్ ప్లేసులో నిలవనుంది. మిగతా 2 మోడళ్లలో సరికొత్త ఫీచర్లను అందిస్తుందని అంచనా. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. ఇంటర్నల్‌గా ఈ సిరీస్ థానోస్ 500 మోడల్ వివో X300 అల్ట్రా నుంచి 200MP టెలిఫోటో కెమెరా కూడా ఉండొచ్చు.

వివో ఫోన్లు కొత్త మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లతో వస్తాయని భావిస్తున్నారు. అయితే, వివో ఇంకా ప్రాసెసర్‌లను వెరిఫై చేయలేదు. ఈ లైనప్ జైస్‌తో వివో భాగస్వామ్యాన్ని కొనసాగించనుంది. సర్కిల్ రియర్ కెమెరా డిజైన్‌తో కూడా రావొచ్చు.

వివో X400 లేనట్టేనా? : వివో కూడా వివో X400 బ్రాండింగ్‌ను స్కిప్ చేసింది. వివో X300 నుంచి నేరుగా వివో X500కి వెళ్తోంది. తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో 4 సంఖ్య మరణానికి సంకేతంగా భావిస్తారట. అందుకే ఆ సంఖ్యను తప్పించినట్టు నివేదికలు చెబుతున్నాయి.