మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా దర్శకుడు వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజువల్స్ నాణ్యత విషయంలో రాజీపడకుండా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కొంత ఆలస్యమవుతున్నప్పటికీ, విడుదలైన తర్వాత థియేటర్లలో సునామీ సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. “విశ్వంభర ఆలస్యంగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోతుంది..
రాసిపెట్టుకోండి” అంటూ వశిష్ఠ ఇచ్చిన ప్రకటన మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అయితే, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ, ఇప్పుడు వశిష్ఠ చేసిన వ్యాఖ్యలతో విశ్వంభర నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఉండకపోవచ్చని స్పష్టమైంది.
ఇక ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.








