ఇటీవల ఒక డ్యాన్స్ షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు రష్మిక మందన్నకు గాయమైంది. దీంతో ఆమెకు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.
ఈ విరామ సమయంలో తన రోజులు ఎలా గడుస్తున్నాయో రష్మిక కొన్ని ఫోటోలతో పాటు వివరించారు. నిరంతరం పరుగులతో బిజీగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం భయానకంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. పరిస్థితుల వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు, పిచ్చివాళ్లలా పరిగెత్తడం కూడా భయానకంగానే ఉంటుందని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
అపారమైన ప్రేమ, సానుకూలత, ప్రార్థనలు, కృతజ్ఞతా భావాల మధ్య సమయం గడపడం అద్భుతంగా ఉందని రష్మిక తెలిపారు. బహుశా జీవితం అంటే ఇదేనేమో అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.








