ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ విరాట్ కోహ్లీతో తనకు గొడవ జరిగిందనే ప్రచారాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ట్రావిస్ హెడ్ తోసిపుచ్చాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ తనకు హ్యాండ్ షేక్ ఇవ్వలేదని వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్ పై హెడ్ తొలిసారిగా వివరణ ఇచ్చాడు.
'కోడ్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ మాట్లాడుతూ, తమ మధ్య రాజీ చేసుకోవడానికి ఏమీ లేదని, కోహ్లీతో తన సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయని తెలిపాడు. మైదానంలో జరిగిన సంఘటనలు లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, వాటిని వ్యక్తిగత వివాదాలుగా చూడకూడదని అతను స్పష్టం చేశాడు.
ఈ వివాదం సమయంలో సోషల్ మీడియాలో తన భార్య జెస్సికా హెడ్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన అభ్యంతరకర మెసేజ్‌లు తనను తీవ్రంగా బాధించాయని హెడ్ వాపోయాడు. క్రీడా ప్రపంచంలో ఇవన్నీ సహజమని భావించినప్పటికీ, తన కుటుంబ సభ్యులను ఆన్‌లైన్ నిందలకు గురిచేయడం దురదృష్టకరమని పేర్కొన్నాడు.
జెస్సికా ఈ పరిస్థితిని చాలా పరిణతితో ఎదుర్కొందని హెడ్ ప్రశంసించాడు. ప్రజలు కొద్దిరోజుల్లోనే ఈ విషయాలను మరచిపోతారని, అయితే ఆటగాళ్ల కుటుంబాలను ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదని అతను అభిప్రాయపడ్డాడు.








