విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, కార్యకర్తల ఉత్సాహాన్ని ఎంపీ చిన్ని తన సెల్ఫీ వీడియోలో బంధించారు. ఈ దృశ్యాలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కార్యకర్తల జోష్‌ను చూసిన ఎంపీ చిన్ని, ఇదే ఉత్సాహంతో పార్టీ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.








