బూర్గంపహాడ్, ఆగస్టు 25 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చిన్యా అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు డీఐఈవోకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాశాల అభివృద్ధి, విద్యాప్రమాణాలపై డీఐఈవో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, షూష్‌ను స్వయంగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
అకడమిక్ రికార్డులు, రిజిస్టర్లు, విద్యార్ధుల అభ్యసన ప్రగతి రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో డీఐఈవో ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ఎన్ఎస్ కుమార్, ఎన్ఎస్ఎస్ పీవో శ్రీనివాస్, పీవీఎస్ఎన్ మూర్తి, కొండా ముకుందం, లైబ్రరీ టీచర్ పద్మావతి, వెంకటకృష్ణ, వెంకటేశ్వర్లు, ప్రదీప్, సరస్వతి, నరేశ్, సాహితీ, దివ్య, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉమ, ఆదిలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.







