వచ్చే వారం బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగల నేపథ్యంలో ఆగస్టు 24 నుంచి 30 మధ్య నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. బ్యాంక్ పనులు ఏవైనా ఉంటే సోమవారమే పూర్తి చేసుకోవడం మంచిది.

ఆగస్టు 25న మిలాద్-ఉన్-నబీ లేదా ప్రవక్త ముహమ్మద్ జన్మదినోత్సవం, మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 26న బరావాఫా, ఈద్-ఇ-మిలాద్ పండుగల కారణంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ అవుతాయి.

ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఆగస్టు 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ఉంటుంది.

సెలవు రోజుల్లో బ్రాంచ్ కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ఏటీఎం సేవలు, RTGS, NEFT వంటి డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.

అయితే, చెక్కుల క్లియరెన్స్, భౌతిక రుణ పత్రాల పరిశీలన వంటి సేవలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోతాయి. కాబట్టి, ఖాతాదారులు తమ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించే ముందు ఆ రోజు బ్యాంక్ తెరిచి ఉందో లేదో తనిఖీ చేసుకోవడం ఉత్తమం.