న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. క్రికెట్‌కు చేసిన విశేష సేవలకు గాను భారత నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో రోహిత్ శర్మను సత్కరించారు. జనవరిలో పద్మ పురస్కారాల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. రోహిత్ నాయకత్వంలో భారత్.. 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013లో కూడా భారత్ ను ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపాడు రోహిత్. 2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో రోహిత్ 597 పరుగులు సాధించి, 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తర్వాత రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు సాధించి రోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో రోహిత్ 648 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.








