Threads యాప్‌ను ఉపయోగిస్తున్న టీనేజర్ల భద్రత కోసం Meta కొత్తగా పేరెంటల్ సూపర్ విజన్ టూల్స్‌ను రూపొందించింది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు యాప్‌లో గడిపే సమయాన్ని పర్యవేక్షించడంతో పాటు, రోజువారీ వినియోగంపై పరిమితులు విధించే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్ల ద్వారా తల్లిదండ్రులు గత వారం రోజుల్లో తమ పిల్లలు ఎంత సమయం యాప్‌లో గడిపారో చూడవచ్చు. అంతేకాకుండా, రాత్రి సమయాల్లో యాప్ యాక్సెస్‌ను నియంత్రించడం లేదా బ్లాక్ చేయడం, అలాగే ఎవరు ట్యాగ్ చేయవచ్చో నిర్ణయించడం వంటి నియంత్రణలు అందుబాటులో ఉంటాయి. స్లీప్ మోడ్ సెట్టింగ్‌లను మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
టీనేజర్ల కోసం ఇప్పటికే ప్రైవేట్ అకౌంట్లు, కంటెంట్ పరిమితులు వంటి రక్షణ ఫీచర్లు యాప్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో యువ వినియోగదారుల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, Meta తన అన్ని యాప్‌లలోనూ ఇటువంటి పేరెంటల్ కంట్రోల్స్‌ను విస్తరిస్తోంది.
ఈ టూల్స్ వచ్చే వారం అమెరికాలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు Meta ప్రకటించింది.








