ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు సాధించిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో వచ్చిన 'సీతారాం బెనోయ్ కేస్ నెం.18' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఐఎమ్ డీబీలో టాప్ రేటింగ్ దక్కించుకున్న ఈ చిత్రం, ఇప్పటికే కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మంచి స్పందన అందుకుంది.
ఈ సినిమా కథ అనెగడ్డ అనే ప్రశాంతమైన గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో వరుసగా జరుగుతున్న దారుణ హత్యలు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టి సైకో కిల్లర్ చేస్తున్న ఈ సీరియల్ మర్డర్లను ఛేదించడానికి సీతారాం అనే ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం, ఆ కిల్లర్ ఉద్దేశం ఏమిటనేది మిగతా కథ.
దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ రాఘవేంద్ర హీరోగా నటించగా, గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి కీలక పాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్‌పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.








