గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా నుంచి తాజాగా రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘మనసాగదే’ పేరుతో వచ్చిన ఈ రొమాంటిక్ ట్రాక్, విడుదలైన కొద్ది నిమిషాల్లోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యాక్షన్ పాత్రలతో మాస్ ఆడియన్స్‌ను అలరించిన యష్, ఈ సినిమాలో తనలోని రొమాంటిక్ కోణాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు.

ఈ పాటలో యష్, తారా సుతారియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. విజువల్స్‌తో పాటు సంగీతం కూడా మనసుకు హత్తుకునేలా ఉండటంతో అభిమానులు యష్ కొత్త లుక్‌ను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో యష్, తారాలతో పాటు నయనతార, కియారా అద్వానీలను కూడా చూపించారు.

గతంలో విడుదలైన టీజర్లు, పాటల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఆ నేపథ్యంలో, ఈ కొత్త పాటలో మేకర్స్ ఆ టోన్‌ను కాస్త తగ్గించారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు హీరోయిన్ల రిలేషన్‌పై దృష్టి పెడుతూ ఈ పాటను డిజైన్ చేశారు.

‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 26న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.