కొంతకాలంగా థియేట్రికల్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు 2026 కలిసివచ్చింది. ఈ ఏడాది విడుదలైన 'కరుప్పు' సినిమా కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా, భారీ లాభాలను కూడా అందించింది.
సూర్య నుంచి ఈ ఏడాది రెండో సినిమాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అంతేకాదు, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో సూర్య చేసిన 47వ సినిమాను కూడా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూడు సినిమాల విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.








