తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్న సినిమా 'మండాడి'. ఈ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పిస్తుండగా, ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఆయనే నిర్మిస్తున్నారు. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సముద్రపు ఒడ్డున ఉండే జాలర్లు, వారి మధ్య జరిగే గొడవలు, సముద్రంలో పడవల పోటీ నేపథ్యంలో సాగుతోంది. టీజర్ చూస్తుంటే సినిమా ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థమవుతోంది.

ఈ సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ విడుదల చేస్తోంది.