అమరావతి: సుప్రీంకోర్టులో వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ఆర్‌సిపి, లేళ్ల అప్పిరెడ్డి వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్‌పై వాదన వినేందుకు కూడా సుప్రీం ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు.

పిటిషన్ విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏదన్నా ఉంటే హైకోర్టుకు వెళ్లాలన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్‌నాగు ధర్మాసనం సూచించింది. సామాజిక మాధ్యమ ఖాతాలు నిలుపుదల చేశారని వైసిపి, లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.