Telugu » Business » Senior Citizens Earn Interest Every 3 Months With This Government Scheme
Senior Citizens Scheme : సీనియర్ సిటిజన్లకు సూపర్ సేవింగ్స్ స్కీమ్.. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం పొందాలంటే ఈ స్కీమ్ లో జాయిన్ కావాల్సిందే.. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత జాబ్ సమయంలో వచ్చే జీతం నెలనెలా రాదు.
అప్పుడు సేవింగ్స్, పింఛన్ లేదంటే ఏదైనా పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపైనే డిఫెంట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే రిటైర్మెంట్‌కు ముందే సరైన సేవింగ్స్ ఉంచుకోవాలని అంటుంటారు. అందులోనూ మార్కెట్ రిస్క్‌ను ఇష్టపడని వారికి ప్రభుత్వ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.
అలాంటి పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme) ఒకటి. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ చిన్న పొదుపు పథకంలో మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం అసలు ఉండదు. అందుకే స్థిరమైన రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని తప్పక ఎంచుకోవాలి. ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది.
కేంద్రం చిన్న సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికం రివ్యూ చేస్తుంటుంది. అయితే, పెట్టుబడి సమయంలో వర్తించే వడ్డీ రేటు ప్రకారం ఖాతాకు రాబడి లెక్కిస్తారు. ఈ స్కీమ్‌లో సాధారణంగా 60 ఏళ్లు లేదంటే ఆపై వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. అర్హత ఉన్నవారు కనీసం రూ.1,000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
SCSS పథకం ప్రత్యేకతల్లో త్రైమాసిక వడ్డీ ఒకటి. వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.30 లక్షలు (8.2 శాతం) వార్షిక వడ్డీకి పెట్టుబడి పెడితే, ఏడాదికి సుమారు రూ.2.46 లక్షలు వడ్డీ వస్తుంది. అంటే, 3 నెలలకు సుమారు రూ.61,500 చొప్పున వడ్డీ లభిస్తుంది. రూ.24.39 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికంగా సుమారు రూ.50వేల వరకు వడ్డీ వస్తుంది.
ఈ పథకానికి ప్రారంభ మెచ్యూరిటీ టైమ్ 5 ఏళ్లు ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మెచ్యూరిటీ తర్వాత ఖాతాను పొడిగించుకోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందే విత్ డ్రా నిబంధనలు, పన్నులు, వడ్డీ పేమెంట్ విధానం వంటి అన్ని అంశాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
పన్ను పరంగా పరిశీలిస్తే.. ఈ పథకంలో వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితం కాదు. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. కొన్ని మినహాయింపులు, బెనిఫిట్స్ పొందవచ్చు. మీ వ్యక్తిగత పన్ను పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం బెటర్.








