సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సుమారు రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

గతంలో ఇదే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించింది. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, ‘సంబరాల ఏటి గట్టు’ను కూడా జనవరి 12, 2027న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదట ఈ సినిమాను డిసెంబర్ 2026లో విడుదల చేయాలని భావించినప్పటికీ, సంక్రాంతి సీజన్ కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.