చికెన్ మెజెస్టిక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకుని, అందులో ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్డు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన ఉంచిన తర్వాత, పాన్ మీద నూనె వేడి చేసి చికెన్ ముక్కలను వేయించుకోవాలి.

మరో పాన్ లో నూనె వేడి చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, సోయాసాస్ మరియు ముందుగా వేయించిన చికెన్ ముక్కలను కలిపి, చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు వేయిస్తే రెస్టారెంట్ తరహా హైదరాబాదీ చికెన్ మెజెస్టిక్ సిద్ధమవుతుంది.

ప్రాన్స్ పకోడి కోసం రొయ్యలను ఒక గిన్నెలో తీసుకుని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, కొత్తిమిర, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, నూనె వేసి కలపాలి. దీనికి మొక్కజొన్న పిండి, శనగపిండి, బియ్యప్పిండి మరియు తగినన్ని నీళ్లు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకటి నుంచి మూడు గంటల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి.

చివరగా పాన్ లో నూనె వేడి చేసి, సిద్ధం చేసుకున్న రొయ్యలను ఒక్కోటిగా నూనెలో వేయాలి. వీటిని తక్కువ మంట మీద వేయించుకుంటే రుచికరమైన ప్రాన్స్ పకోడి తయారవుతుంది.