నటి కియారా అద్వానీ వచ్చే వారం విడుదల కానున్న 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి మొదటిసారి ఒక కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత కనికా ధిల్లాన్ ఈ చిత్రంతో దర్శకురాలిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. 'కేదార్‌నాథ్', 'హసీన్ దిల్‌రుబా', 'రష్మీ రాకెట్', 'రక్షా బంధన్', 'డంకీ' వంటి సినిమాలకు కనికా కథలు అందించారు.

ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు మేకర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే, ఈ వార్తపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు.