ఐపీఎల్ (IPL)లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గూటికి మారతారనే ప్రచారం జోరందుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ఈ మార్పు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ ట్రేడ్ డీల్ కోసం ముంబై ఇండియన్స్ యాజమాన్యం పెట్టిన షరతులు సీఎస్‌కేను ఆశ్చర్యానికి గురిచేశాయి.

హార్దిక్ పాండ్యాను వదులుకోవాలంటే తమకు శివం దూబేతో పాటు యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రేను ఇవ్వాలని ముంబై ప్రతిపాదించింది. కానీ, ఆయుష్ మ్హత్రేను వదులుకోవడానికి సీఎస్‌కే సిద్ధంగా లేదు. దీంతో చెన్నై యాజమాన్యం శివం దూబే, దెవాల్డ్ బ్రెవిస్ మరియు రూ. 10 కోట్ల నగదు ఇచ్చేందుకు కొత్త ప్రతిపాదనను ముంబై ముందు ఉంచింది.

ఎంఎస్ ధోనీతో చర్చించిన తర్వాత, హార్దిక్ పాండ్యా సీఎస్‌కే తరఫున ఆడటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముంబై, సీఎస్‌కే మధ్య చర్చలు విఫలమైతే, ఈ డీల్‌ను దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సిద్ధంగా ఉంది.

ఈ భారీ ట్రేడ్ డీల్ నగదు రూపంలో జరుగుతుందా లేక ఆటగాళ్ల మార్పిడితో పూర్తవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం సీఎస్‌కే ఆఫర్‌ను అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.