చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ముత్తరపల్లికి చెందిన కె. చిరంజీవి (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురం సమీపంలో ఉన్న ఇటుకల తయారీ కేంద్రంలో చిరంజీవి కూలీగా పనిచేస్తున్నాడు.
ఇటీవల జరిగిన తన వివాహం కోసం చిరంజీవి సుమారు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే, ఆ అప్పులను తిరిగి చెల్లించే మార్గం కనిపించకపోవడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై చిరంజీవి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







