మంత్రి కొండా సురేఖ అంశం పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ఆయన స్పందించారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని సిఎం వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరూ అతీతులు కారని తేల్చి చెప్పారు. ఊహాజనిత కథకాలను ప్రస్తావించవద్దని కోరారు.