2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సత్వంత్ సింగ్ (61) సిద్ధమయ్యారు. ఫతేగర్ సాహిబ్ జిల్లాలోని పఠాన నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని అకాలీ దల్ వారిస్ పంజాబ్ దే పార్టీ ఖరారు చేసింది. పార్టీ తొలి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
సత్వంత్ సింగ్ తండ్రి కేహర్ సింగ్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించారు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీని ఆమె నివాసంలోనే ఇద్దరు అంగరక్షకులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో కేహర్ సింగ్‌ను దోషిగా తేల్చారు.
ఈ అభ్యర్థిత్వాన్ని అకాలీ దల్ వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు తర్సేమ్ సింగ్ ప్రకటించారు. ఖదూర్ సాహిబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ తండ్రి అయిన తర్సేమ్ సింగ్, ప్రస్తుతం అస్సాం జైలులో ఉన్నారు. 2023లో అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడి కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు.







