Save The Tigers 3 | ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతోపాటు సైతాన్, సేవ్ ది టైగర్స్ ప్రాంచైజీతో సక్సెస్‌ఫుల్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు మహి వి రాఘవ్ (Mahi V Raghav). ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ క్రియేషన్‌లో సీజన్ 3ని శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 3 (Save the Tigers 3). ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాగా మొదటి రెండు సీజన్ల మాదిరిగానే ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మూవీ లవర్స్ ను ఎంటర్‌టైన్ చేస్తూ దూసుకెళ్తోంది.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, కామాక్షి భాస్కర్ల అండ్ టీం అందిస్తున్న వినోదానికి ఓటీటీ మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. సేవ్ ది టైగర్స్ టాప్ వ్యూయర్ షిప్ సాధించి సౌతిండియాలో బిగ్గెస్ట్ డిజిటల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సీజన్ సీజన్‌కు క్రేజ్‌ను పెంచేస్తూ షోరన్నర్‌గా నిలుస్తున్నాడు మహి వీ రాఘవ్.
ఓ స్టోరీని కమర్షియల్‌గా, ఇంప్రెసివ్‌గా రూపొందించడం అంత సులభమేమి కాదు.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంటర్‌టైన్ మెంట్ వాల్యూను ఏ మాత్రం తగ్గించకుండా ఒక ప్రాంచైజీని ఎంత స్ట్రాంగ్‌గా నడిపించాలో మరోసారి సీజన్ ౩తో నిరూపిస్తున్నాడు మహి వి రాఘవ్. ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మన ఆడియెన్స్ ఇంకా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదని మహి వి రాఘవ్ ఓ చిట్ చాట్‌లో చేసిన కామెంట్స్.. అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్‌లో కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి.
Raazi leni samsaram, Naada leni pyjama lantidhi… nilavadhu! 🙌🏻
Hotstar Specials #SaveTheTigers3 streaming now on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/JlujXNwxe7








