రోజుకు ఒకటి లేదా రెండు వాము ఆకులను నమలి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లోని ఎంజైములు జీర్ణక్రియను పెంచి, కడుపులోని టాక్సిన్లను బయటకు తీసుకురావడంలో సహాయపడతాయి.

చాలా కాలంగా ఉన్న దగ్గు, గొంతు నొప్పి, జలుబు లాంటి శ్వాసకోశ సమస్యలకు రెండు వాము ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి, శ్వాస సులభంగా ఆడేలా చేస్తుంది.

వాము ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఫ్లూ, జ్వరాలు, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారు వాము ఆకులను నీటిలో మరిగించి, ఆ ఆవిరిని పట్టడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. నోటి దుర్వాసన ఉన్నవారు ఉదయాన్నే ఒక ఆకును నమలితే బ్యాక్టీరియా నశిస్తాయి, చిగుళ్ల వాపులు తగ్గుతాయి.

వాము ఆకులను పచ్చడి, రసం లేదా బజ్జీలుగా తినవచ్చు. కానీ ఆరోగ్య ప్రయోజనాల కోసం కషాయం లేదా పచ్చి ఆకు రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇది సమాచారం మాత్రమే. వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.