అథర్వా ప్రధాన పాత్రలో నటించిన సినిమా నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళ్‌లో 'ఇద్యాయం మురళి' పేరుతో, తెలుగులో 'హృదయం మురళి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమాలో అథర్వా సరసన ప్రీతి ముఖుందాన్, కయాదు లోహర్ నటించారు. వీరితో పాటు నటరాజన్ సుబ్రమణియం, రాంకి, నిహారికా ఎన్‌ఎం, రక్షణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించడమే కాకుండా, సినిమాలో ఒక పాత్రలో కూడా నటించారు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఫహద్ ఫాసిల్ మరియు మలవిక మోహనన్ అతిథి పాత్రల్లో (క్యామియో) మెరిశారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.







