మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తాను మహారాష్ట్ర పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అక్కడికి వెళ్లి అతడిని, అతడి అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది. గతంలోనే బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు వేగవంతం చేశారు.
నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తరలిస్తున్నారు. టెట్ పేపర్ లీక్ నెట్‌వర్క్‌లో బిజేంద్ర గుప్తా పాత్రపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఇతర పరీక్షల పేపర్ లీక్ సిండికేట్‌లతో అతనికి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






